రేణుకపై మోడీ వ్యాఖ్యలపై రాజ్యసభలో గందరగోళం

renukaకాంగ్రెస్ నిరసనల  కారణంగా  రాజ్యసభ  ప్రారంభమైన  కాసేపటికే  వాయిదా పడింది. రాష్ట్రపతికి ధన్యవాద  తీర్మానంపై  జరిగిన  డిస్కషన్ లో భాగంగా  రాజ్యసభలో ప్రధానమంత్రి  నరేంద్రమోడీ.. కాంగ్రెస్ ఎంపీ  రేణుక చౌదరిపై  అనుచిత వ్యాఖ్యలు  చేశారని కాంగ్రెస్  నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రధాని కామెంట్లకు  వ్యతిరేకంగా రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు నినాదాలతో హోరెత్తించడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.  చైర్మన్  వెంకయ్య  వారిస్తున్నా వినకుండా కాంగ్రెస్ ఎంపీలు  పోడియాన్ని చుట్టుముట్టి  ఆందోళన చేశారు. దీంతో  సభను  వెంకయ్య  మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.

Posted in Uncategorized

Latest Updates