రేణు దేశాయ్ కి నిశ్చితార్థం అయ్యింది

renuసినీనటి, దర్శకురాలు, పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌ నిశ్చితార్థం ఆదివారం(జూన్-24) జరిగింది. పవన్‌ కల్యాణ్‌తో కొంత కాలం సహజీవనం చేసిన తర్వాత 2009లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.  ఆ తర్వాత దాదాపు మూడేళ్లకు 2012లో విడాకులు తీసుకున్నారు.  వీరికి ఇద్దరు పిల్లలు అకీరా నందన్, ఆద్యా ఉన్నారు. విడిపోయిన తర్వాత కూడా ఫంక్షన్లు, బర్త్‌డేలకు కలుస్తూనే ఉండేవారు పవన్‌ కల్యాణ్, రేణు దేశాయ్‌. అయితే అవి ప్యూర్లీ పిల్లలకు సంబంధించిన ఫంక్షన్స్‌ అనే వార్తలు ఉండేవి. పవన్‌ కల్యాణ్‌ నుంచి విడాకులు తీసుకున్నాక ఒంటరిగా ఉంటున్న రేణు ఇటీవలే మళ్లీ ప్రేమలో పడ్డానంటూ ట్వీటర్‌లో పోస్ట్‌లు పెట్టారు. ఆ లవ్‌ని మ్యారేజ్‌ వరకూ తీసుకెళ్లారు. ఎంగేజ్మెంట్ కు సంబంధించి రెండు ఫొటోలు షేర్‌ చేశారు.  అంతే కాదు నా పిల్లలు లేనిదే నా సంతోషం పరిపూర్ణం కాదు. నా లైఫ్‌లో ఓ కొత్త ఫేజ్‌ స్టార్ట్‌ చేస్తున్నప్పుడు వాళ్లిద్దరూ నా పక్కన ఉండటం చాలా సంతోషంగా ఉందంటూ తెలిపారు రేణు దేశాయ్.

అయితే జీవిత భాగస్వామి ఎవరు.. ఏంటి అన్న వివరాలపై రేణు దేశాయ్ స్పష్టత ఇ‍వ్వకపోయినా.. ఎంగేజ్‌ మెంట్‌ జరిగిన విషయాన్ని మాత్రం తన పోస్ట్‌తో తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates