రేణు నిశ్చితార్థం : మాజీ భార్య మళ్లీ పెళ్లిపై పవన్ స్పందన

Pawan-Kalyan-renuజనసేన అధినేత పవన్ మాజీ భార్య రూణూ దేశాయ్ మళ్లీ పెళ్లి చేసుకుంటుంది. ఇటీవలే ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. దీనిపై మంగళవారం (జూన్-26) ట్విట్టర్ ద్వారా స్పందించారు పవన్ కల్యాణ్. రేణూకు ఎంగేజ్ మెంట్ శుభాకాంక్షలు తెలిపారు. మిస్‌ రేణూగారు.. కొత్త జీవితంలోని అడుగుపెడుతున్న మీకు.. నా హృదయపూర్వక అభినందనలు. మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీకు శాంతి, శ్రేయస్సు కలగాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు పవన్.

రేణూ దేశాయ్‌ను ఉద్దేశించి మిస్‌ అని పవన్‌ ట్విట్ చేయడంపై  పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ ట్వీట్‌ చక్కర్లు కొడుతోంది. పవన్‌ నుంచి దూరం అయ్యాక ఆమె రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. పవన్ ఎలా స్పందిస్తారా అని రెండు రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నెటిజన్లు ఇప్పుడు శాంతించారు. రేణుకి ఆల్ ద బెస్ట్ చెప్పటంతో ఫ్యాన్స్ కూడా కూల్ అయ్యారు.

Posted in Uncategorized

Latest Updates