రేపటి నుంచి ఎవరు పెడతారు : చపాతీలు మాడ్చిందని.. విడాకులు ఇచ్చేశాడు

త్రిపుల్ తలాక్ ను ఆపేందుకు కేంద్రం ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నప్పటికీ ఇంకా ట్రిపుల్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చపాతీని మాడ్చిందని భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పాడు ఓ భర్త. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబా జిల్లాలోని పహ్రెతా గ్రామంలో ఆదివారం(జులై-8) ఈ ఘటన జరిగింది.
ఏడాది క్రితం భాధిత యువతికి ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొన్నిరోజులకే భార్యను శారీరకంగా హింసించేవాడు, సిగరెట్లతో ఒంటిపై కాల్చేవాడు. మూడు రోజుల క్రితం.. వంట చేసే సమయంలో చపాతీ కొంచెం మాడిపోయిందన్న కారణంతో తన భర్త త్రిపుల్ తలాక్ చెప్పాడని ఓ 24 ఏళ్ల యువతి ఆదివారం పోలీసులకు కంఫ్లెయింట్ చేసిందని సీనియర్ పోలీస్ అధికారి బన్స్ రాజ్ యాదవ్ తెలిపారు. యువతి ఇచ్చిన కంప్లెయింట్ మేరకు యువతి భర్తపై గృహహింస కేసుని నమోదు చేసినట్లు తెలిపారు.
త్రిపుల్ తలాక్ నేరమంటూ రాజ్యాంగంలోని ఆర్టికల్-14 ప్రకారం ల్రిపుల్ తలాక్ చట్టవిరుద్దం, నేరమంటూ సుప్రీం కోర్టు చెప్పిన విషయం తెలిసిందే. లోక్ సభలో కూడా త్రిపుల్ తలాక్ బిల్లు పాస్ అయింది. అయితే రాజ్యసభలో ఇంకా ఈ బిల్లు ఆమోదం పొందలేదు.

Posted in Uncategorized

Latest Updates