రేపటి నుంచి పూరీ జగన్నాథుడి రథయాత్ర

ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథుడి రథయాత్ర ఉత్సవాలకు అంతా సిద్ధమైంది. శనివారం(జూలై-14) నుంచి ఈ రథోత్సవం వైభవంగా జరగనుంది. ఈ రథోత్సవాన్ని ఇప్పటికే  దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరికి చేరుకున్నారు. దేవతామూర్తులు జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్రల దర్శనం కోసం ఇప్పటికే భక్తులు బారులు తీరుతున్నారు.

జగన్నాథుడి రథయాత్ర కోసం ప్రతి ఏడాది కొత్త రథాలను తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. జగన్నాథుడి రథోత్సవం నేత్రోత్సవంతో ప్రారంభమై రసగుల్ల ఉత్సవంతో ముగుస్తుంది. ఈ ఏడాది నేత్రోత్సవం శుక్రవారం(జూలై-13)న ప్రారంభమై రసగుల్ల ఉత్సవంతో జులై 25న ముగుస్తుంది. శనివారం(జూలై-14) రథోత్సవం గర్భగుడి దగ్గర నుంచి గుడిచా దగ్గరకు బయలు దేరుతుంది. తొమ్మది రోజుల పాటు గుడిచా దగ్గరనే ఉండి తర్వాత తిరిగి గర్భగుడికి చేరుకొంటుంది.

Posted in Uncategorized

Latest Updates