రేపటి నుంచి మండలి సమావేశాలు

రాష్ట్రంలో రేపటి (గురువారం) నుంచి శాసన మండలి సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి గవర్నర్ నరసింహన్ తో  CS SK జోషి, DGP మహేందర్ రెడ్డి రాజ్ భవన్ లో భేటీ ఆయ్యారు. మండలి సమావేశాలు… రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంతో పాటు పలు సమస్యలపై చర్చించారు.

మరోవైపు ఇవాళ(బుధవారం) రాష్ట్ర ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం.. గవర్నర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పలు అంశాలు ఇరువురి భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా రేపటి నుంచి జరగనున్న శాసన మండలి సమావేశాల నిర్వహణ, ఎన్నికల ఏర్పాట్లు ఇతర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రాజకీయపరమైన అంశాలు కూడా ఇద్దరి భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.

గురువారం ఉదయం 11 గంటలకు శాసన మండలి సమావేశం ప్రారంభం కానుంది.

Posted in Uncategorized

Latest Updates