రేపటి నుంచే : రెండు రోజుల చైనా టూర్ కు మోడీ

modi21చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తో రేపు సమావేశం కానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.  రేపు, ఎల్లుండి కింగ్ డావోలో షాంఘై సహకార సంస్థ 18వ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. దీనిలో పాల్గొనేందుకు చైనా వెళ్తున్నారు మోడీ. సభ్యదేశాల మధ్య సహకారం, రీజియన్ లో పరిస్థితులతో పాటు రాజకీయ, భద్రతాంశాలు, ఆర్థిక-సాంస్కృతిక సహకారం తదితర అంశాలపై సదస్సులో చర్చిస్తారు. ఈ సందర్భంగా మోడీ-జిన్ పింగ్ భేటీ ఉంటుందని విదేశీ వ్యవహారాలశాఖ ప్రతినిధి రవీష్  కుమార్ చెప్పారు. ఉహాన్ లో నెల క్రితం అనధికార సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలుచేసే అంశం చర్చకు వచ్చే చాన్సుందన్నారు. రష్యా అధ్యక్షుడు వాద్లిమర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు హాసన్ రౌహానితో కూడా మోడీ సమావేశం అవుతున్నారు. రెండు నెలల్లో రెండవసారి జిన్ పింగ్ తో, నెల వ్యవధిలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశమవుతున్నారు మోడీ.

Posted in Uncategorized

Latest Updates