రేపటి నుంచే స్టార్ట్ : నీళ్లను వృథా చేస్తే నల్లా కనెక్షన్ కట్

saksవేసవికాలంలో నీటి కష్టాలు సర్వసాధారణమే. ఒక్క బిందె నీరు కోసం కొట్లాటలు జరగటం మనం చూస్తుంటాం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్క బిందె నీరు దొరక్క కొందరు అల్లాడుతుంటే…. కొందరు మాత్రం అవసరం లేకపోయినా నీళ్లను విచ్చలవిడిగా వాడేస్తుంటారు. దీంతో ఇలా వేసవిలో నీటిని వృథా చేయకుండా అరికట్టేందుకు ఓ కొత్త నిబంధనను తీసుకొచ్చింది చండీఘఢ్‌ ప్రభుత్వం.
నీళ్లను సప్లయి చేసే టైంలో ఎవరు కూడా తమ వాహనాలు కడగకూడదని, ఇళ్ల ముందు గార్డెన్‌, లాన్‌ లలో పైపులతో నీరు పడుతూ శుభ్రం చేయరాదని చంఢీఘడ్ ప్రభుత్వం తెలిపింది. ఓవర్‌హెడ్‌, అండర్‌గ్రౌం డ్‌ ట్యాంకుల్లో నీరు నిండిపోయి బయటకు ప్రవహించినా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఆదివారం(ఏప్రిల్-15) నుంచి ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే 2వేల రూపాయల ఫైన్ వేస్తామని చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. మొదటిసారి ఉల్లంఘనకు జరిమానా విధిస్తామని, అయితే రెండోసారి కూడా అదే తప్పు చేస్తే వాటర్ కనెక్షన్ తొలగిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉదయం 4 గంటల నుంచి 9 గంటల వరకు నీటి సరఫరా చేస్తుండగా.. త్వరలోనే దీన్ని 3.30గంటల నుంచి 8.30 గంటలకు మార్చనున్నారు. ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 30 వరకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates