రేపు అంత్యక్రియలు : ఇండియా బయలుదేరిన శ్రీదేవి మృతదేహం

sredevi-embolmingసినీ నటి శ్రీదేవి మృతదేహానికి కొద్ది సేపటి క్రితమే ఎంబాల్మింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. ఆ తర్వాత ఆమె భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు దుబాయ్ పోలీసులు. కుటుంబ సభ్యులు దుబాయ్ ఎయిర్ పోర్ట్ కు తీసుకొచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు విమానం దుబాయ్ నుంచి ఇండియాకి బయలుదేరనుంది. రాత్రి 10 గంటలకు శ్రీదేవి భౌతికకాయం ముంబై ఛత్రపతి శివాజీ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనుంది.

ఫిబ్రవరి 28వ తేదీ బుధవారం మధ్యాహ్నం వరకు సన్నిహితులు, అభిమానులు సందర్శనార్థం శ్రీదేవి స్వగృహం భాగ్య బంగ్లాలో ఆమె భౌతికకాయం ఉంచనున్నారు. తర్వాత ముంబైలోని పవర్‌ హన్స్‌ స్మశానంలో   అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికే అనేక మంది సినీ స్టార్స్, ప్రముఖులు ముంబై చేరుకున్నారు.
emb2

Posted in Uncategorized

Latest Updates