రేపు ఉస్మానియా డిగ్రీ పరీక్షా ఫలితాలు

Osmania University
Osmania University
2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించి, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాలు గురువారం (మే-24) విడుదల కానున్నాయి. హైదరాబాద్ ఓయూ గెస్ట్‌హౌజ్‌ లోని ఐసీఎస్‌ఎస్‌ఆర్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు నిర్వహించనున్న కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎస్. రామచంద్రం, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ కృష్ణారావు ఈ ఫలితాలను విడుదల చేస్తారు. ఫలితాలను ఓయూ వెబ్‌ సైట్‌ తో పాటు పలు ఇతర వెబ్‌ సైట్‌ లలో అందుబాటులో ఉంచుతామని తెలిపారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates