రేపు కొండగట్టులో నారాయణ బలి శాంతి హోమం

హైదరాబాద్ : ఆంజనేయ స్వామి కులువై ఉన్న కొండగట్టులో రేపు(సెప్టెంబర్ 26) నారాయణ బలిశాంతి హోమం నిర్వహిస్తున్నారు. శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద ఆధ్వర్యంలో నారాయణ బలిహోమం కార్యగ్రమం జరుపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కోర్టు ఆదేశాలతో ఇటీవలే హైదరాబాద్ కు వచ్చిన స్వామి పరిపూర్ణానంద… బస్సు ప్రమాదం జరిగిన తర్వాత కొండగట్టులో బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. సెప్టెంబర్ 26న నారాయణ బలి శాంతి హోమం నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే ఈ హోమం నిర్వహించబోతున్నారు. యాక్సిడెంట్ లో చనిపోయిన వారి ఆత్మశాంతికోసం ఈ హోమం నిర్వహిస్తున్నారు. మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఈ హోమం ద్వారా భగవంతున్ని ప్రార్థిస్తామని పరిపూర్ణానంద చెప్పారు.

సెప్టెంబర్ 11న కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంలో 63 మంది చనిపోయారు. బస్సు ఓవర్ లోడ్ కావడం… డ్రైవర్ బస్సును న్యూట్రల్ లో నడపడంతో.. బస్సు ప్రమాదాల చరిత్రలోనే అతిపెద్ద యాక్సిడెంట్ జరిగింది. దాదాపు నలభై మంది యాక్సిడెంట్ లో గాయాలతో చికిత్స పొందుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates