రేపు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయ శుద్ధిలో భాగంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని రేపు(మంగళవారం) తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) నిర్వహించనుంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని కార్యక్రమాన్ని నిర్వహించనుంది. మంగళవారం ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఆలయాన్ని పవిత్ర జలాలతో శుద్ధి చేస్తారు.తర్వాత పరిమళ భరిత సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన లేపనం ఆలయ గోడలకు పూస్తారు. ఇందులో భాగంగా వేకువజాము నుంచి మధ్యాహ్నం వరకు శ్రీవారి దర్శనాన్ని TTD నిలిపివేయనుంది. శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవ అష్టదళ పాదపద్మారాధన సేవను రద్దు చేశారు. ఇతర ఆర్జిత సేవలన్నీ యథాతథంగా నిర్వహిస్తారు ఆలయాధికారులు.

Posted in Uncategorized

Latest Updates