రేపు జోగులాంబ నుంచి కాంగ్రెస్ ప్రచారం

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రానుండటంతో అన్ని పార్టీల నేతలు ప్రచారంలో బిజీ అయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టేందుకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా రేపు(గురువారం) ఉదయం 10 గంటలకు జోగులాంబ దేవాలయం ఆలంపూర్ నుంచి కాంగ్రెస్ ప్రచారం ప్రారంభించనుంది. హైదరాబాద్ నుంచి ఆలంపూర్ కు హెలికాఫ్టర్ లో బయలుదేరనున్నారు TPCC చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ భట్టి, AICC ప్రధాన కార్యదర్శి కుంతియా తో పాటు కమిటీల చైర్మన్లు. జోగులాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత లాంఛనంగా ప్రచారాన్ని ప్రారంభించనున్నారు కాంగ్రెస్ నేతలు.

Posted in Uncategorized

Latest Updates