రేపు టీవీల్లో పే ఛానళ్లు రావు : కేబుల్ టారిఫ్ కి వ్యతిరేకంగా బ్లాక్ డే

కేబుల్ టారిఫ్ కి వ్యతిరేకంగా రేపు(శనివారం) బ్లాక్ డేగా పాటిస్తున్నట్లు MSOల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ రెడ్డి తెలిపారు. కేబుల్ టారిఫ్ కి వ్యతిరేకంగా ఇందిరాపార్క్ దగ్గర తెలంగాణ,ఏపీకి చెందిన MSO, కేబుల్ ఆపరేటర్లు ధర్నా చేశారు. ఈ ధర్నాకి ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, ముఠాగోపాల్, సుధీర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సుభాష్ రెడ్డి మాట్లాడుతూ శనివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పే ఛానళ్లను నిలిపేస్తామన్నారు. న్యూస్ ఛానళ్లు మాత్రం యధావిధిగా నడుస్తాయన్నారు.

ట్రాయ్.. కేబుల్ వ్యవస్థని నాశనం చేయాలని చూస్తోందని ఎంఎస్ఓల సంఘం నాయకులు మండిపడ్డారు. ఇప్పుడు 150 రూపాయలకే  3 వందల ఛానళ్లు అందిస్తున్నామని.. టారిఫ్ అమల్లో కొస్తే 6 వందల రూపాయలు చెల్లించాల్సి వస్తోందన్నారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ..పెద్ద కంపెనీలను బాగు చేసేందుకు కోట్ల మంది ప్రజలపై టారిఫ్ పేరుతో భారం వేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి టారిఫ్ ని రద్దు చేయిస్తామన్నారు. కేబుల్ టీవీ బిల్లు పెంచితే సామాన్య ప్రజలపై భారం పడుతుందని వారన్నారు. ఈ ధర్నాకి తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు ఏపీ నుంచి కూడా MSO, కేబుల్ ఆపరేటర్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Posted in Uncategorized

Latest Updates