రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్

kcrసీఎం కేసీఆర్ రేపు ( గురువారం, జూన్-14)  ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయనకు ఎల్లుండి (శుక్రవారం,జూన్-15)  ప్రధాని నరేంద్ర మోడీ అపాయింటుమెంట్ లభించినట్లుగా తెలుస్తోంది. దీంతో కేసీఆర్ గురువారం ఢిల్లీకి బయలుదేరి… ఎల్లుండి(శుక్రవారం,జూన్-15) మధ్యాహ్నం 12 .30 గంటలకి ప్రధాని నరేంద్ర మోడీతో  సమావేశమవుతారు.  మోడీతో భేటీ సందర్భంగా జోనల్ వ్యవస్థ సవరణలు ఆమోదించాలని కోరనున్నారు. అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీంతో పాటు.. విభజన హామీలు అమలు చేయాలని  ప్రధానిని కోరనున్నారు సీఎం.

ఢిల్లీ పర్యటనపై సీఎం కేసీఆర్  బుధవారం(జూన్-13) రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ప్రధాని మోడీ తో భేటీ.. కొత్త జోన్లు, రిజర్వేషన్లు  ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం.

Posted in Uncategorized

Latest Updates