రేపు మంత్రివర్గ ఉపసంఘం భేటీ

పంచాయతీరాజ్ రిజర్వేషన్ల అంశం తో పాటు అదనపు అడ్వకేట్‌ జనరల్‌, అధికారులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చించనుంది. బుధవారం(జులై-11) సాయంత్రం 4 గంటలకు మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ఈ సమావేశం కానుంది.
పంచాయతీరాజ్ సంస్థల్లో ప్రజాప్రతినిధుల ఎన్నికలకు కేటాయించే రిజర్వేషన్ 50 శాతం మించకూడదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అవసరమైన కసరత్తు చేసి, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కావాలని సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

Posted in Uncategorized

Latest Updates