రేపు మళ్లీ భారత్ బంద్..అలర్టైన హోం శాఖ

111రేపు మళ్లీ భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి కొన్ని సంస్థలు. మంగళవారం(ఏప్రిల్-10) భారత్ బంద్ సహకరించాలంటూ కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు, మెసేజ్ లు వచ్చాయి. దీంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది. ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఒక అడ్వయిజరీ జారీ చేసింది. కొన్ని గ్రూపులు రిజర్వేషన్ సిస్టమ్‌కు వ్యతిరేకంగా భారత్ బంద్‌కు పిలుపునిస్తే..ఈనెల 2న దళిత సంస్థల భారత్ బంద్ హింసాత్కంగా మారడాన్ని వ్యతిరేకిస్తూ మరికొన్ని సంస్థలు బంద్ పిలుపునిచ్చాయి. కేంద్ర హోం శాఖ హెచ్చరికలతో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి.

Posted in Uncategorized

Latest Updates