రేపు రాజేంద్రనగర్ లో సీఎం రైతు సమన్వయ సమితి

kcr-pass booksరైతు సమన్వయ సమితులతో సీఎం కేసీఆర్ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు (ఆదివారం,ఫిబ్రవరి-25) రాజేంద్రనగర్ లో.. ఎల్లుండి(సోమవారం) కరీంనగర్ లో మండలస్థాయి రైతు సదస్సులు రోజుకు రెండు సెషన్లవారీగా జరుగనున్నాయి. రైతు సమన్వయ సమితులతో కలిగే లాభాలపై సీఎం కేసీఆర్ వివరించనున్నారు. రైతుల సందేహాలు పరిష్కరిస్తారు.

రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో మొదటి రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సమావేశం నిర్వహించున్నారు సీఎం కేసీఆర్. రైతు సమన్వయ సమితుల విధులపై సభ్యులకు సీఎం కేసీఆర్ అవగాహన కల్పిస్తారు. రైతుల అనుమానాలు తీర్చి సలహాలను ప్రభుత్వం తీసుకుంటుందని ప్రభుత్వం తెలిపింది. రేపటి సమావేశానికి 13 జిల్లాల నుంచి మండల రైతు సమితి సభ్యులు హాజరవుతారు.

సోమవారం(ఫిబ్రవరి-26) కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో 16 జిల్లాల మండల రైతు సమన్వయ సమితి సభ్యులతో సదస్సు జరగనుంది. దాదాపు 10 వేల మంది వరకు ఈ సదస్సుకు హాజరు కానుండటంతో.. భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సౌకర్యాలు, వాహనాల పార్కింగ్, స్టేజ్ ఏర్పాటు, వీఐపీల భద్రత అంశాల్లో సంబంధిత శాఖలు విధులను విభజించుకుని పనులు చేస్తున్నారు.

కరీంనగర్ లో రైతు సదస్సులో సీఎం కేసీఆర్ దాదాపు గంటన్నర పాటు మాట్లాడే అవకాశముంది. మధ్యాహ్నం సెషన్ లో రైతులతో సీఎం ఇంట్రాక్ట్ అవుతారు. మండల రైతు సమన్వయ సమితి సభ్యులకు అవసరమైన ప్రయాణ, భోజన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది.

Posted in Uncategorized

Latest Updates