రేపు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు : వాతావరణ కేంద్రం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు (సెప్టెంబర్-30)  తేలికపాటి నుంచి ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం. ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 2 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయని.. గురువారం ఉదయం 8 నుంచి శుక్రవారం ఉదయం 8 వరకు అత్యధికంగా జనగామలో 5, మహబూబ్‌ నగర్‌, వనపర్తి, నందిపేటల్లో 4 సెంటీమీటర్ల వర్షం కురిసిందన్నారు వెదర్ రిపోర్ట్ ఆఫీసర్ రాజారావు.  రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయని తెలిపారు. మహారాష్ట్ర దక్షిణ ప్రాంతం నుంచి అరేబియా సముద్రం తీరం మీదుగా శ్రీలంక సమీపంలోని బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి భూమికి కిలోమీటరున్నర ఎత్తులో ఏర్పడి ఉంది.

Posted in Uncategorized

Latest Updates