రేపు రాష్ట్రానికి అమిత్‌ షా రాక

ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రేపు (బుధవారం) రాష్ట్రానికి రానున్నారు. ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు హైదరాబాద్‌లో ముఖ్య నేతలతోపాటు, వివిధ నియోజకవర్గాలకు చెందిన నేతలతో రాష్ట్రంలో జరుగనున్నముందస్తు ఎన్నికల గురించి చర్చిస్తారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులను తెలుసుకోవడంతోపాటు పార్టీ తరఫున పోటీలో ఉండే అభ్యర్థులను గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.

బుధవారం (10న) ఉదయం పది గంటలకు హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన బూత్‌ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులతో సమావేశమవుతారు అమిత్‌ షా. మహబూబ్‌నగర్, నాగర్‌ కర్నూల్, భువనగిరి, నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌లతో సమావేశమవుతారు. ఈ సమావేశాల తరువాత మధ్యాహ్నం రెండు గంటలకు కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ స్టేడియంలో జరిగే సమరభేరి బహిరంగ సభలో ప్రసంగిస్తారు అమిత్‌ షా.

Posted in Uncategorized

Latest Updates