రేపు శబరిమలకు 50 మంది మహిళలు

శబరిమల: కేరళలోని శబరిమల ఆలయానికి అయ్యప్ప భక్తులు పోటెత్తారు. ఆదివారం 50 మంది మహిళా భక్తులు ఆలయాన్ని దర్శించుకునేందుకు సిద్ధమయ్యారు. వీరంతా 50 ఏళ్లలోపు వయసు వారు కావడంతో మరోసారి అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి.

చెన్నైకి చెందిన ‘మణితి2 సంస్థ ఆధ్వర్యంలో 50ఏళ్లు వయసులోపు మహిళలు 50 మంది ఆదివారం శబరిమల దర్శనానికి వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా ఆదివారం ఉదయం 10 గంటలకు కొట్టాయం చేరుకున్నట్లు సమాచారం. అయితే వీరు ఎలాంటి ప్రత్యేక భద్రత కోరలేదని పోలీసులు తెలిపారు. ఒకవేళ వారు నీలక్కల్‌ బేస్‌ క్యాంప్‌ కు చేరుకున్నాక ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

10-50 ఏళ్ల మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించకుండా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ.. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించగా.. ఈ తీర్పుతో శబరిమల రణరంగంగా మారింది. ఆ మధ్య కొందరు మహిళ భక్తులు శబరిమలను దర్శించుకునేందుకు ప్రయత్నించగా.. ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. తీర్పు వెలువడిన నాటి నుంచి ఇంతవరకూ ఏ ఒక్క మహిళ(10-50 ఏళ్ల వయసులోపు) ఆలయంలోకి వెళ్లలేకపోయారు. ఆదివారం ఒక్కసారిగా 50 మంది మహిళలు వెళ్తుండటంతో ఏం జరుగుతుందోనని పోలీసులు అలర్ట్ గా ఉన్నారు.

 

Posted in Uncategorized

Latest Updates