రేపు సమన్వయ సమితీ కోఆర్డినేటర్లలో సీఎం భేటీ : రైతుబంధు, రైతులకు జీవిత బీమాపై చర్చ

 

RAITHI CO KCRరైతు బీమా పథకంపై AEOలు, DAOలు, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లలతో సోమవారం (జూన్-4) హైదరాబాద్ లోని HICC లో సమావేశం నిర్వహించనుంది ప్రభుత్వం. ఈ సమావేశంలో రైతుబీమా పథకంపై సమగ్రంగా చర్చించాలని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి సూచించారు కేసీఆర్. ఈ సదస్సులో ఏఈవోలు, అన్ని జిల్లాల వ్యవసాయ అధికారుల(డీఏవోలు)కు పథకంపై అవగాహన కల్పించనున్నారు. రైతు బీమా పథకం అమల్లో భాగంగా ఏఈవోలు ప్రతి రైతు దగ్గర నామినీ వివరాలను సేకరించాల్సి ఉన్న సంగతి తెలిసిందే. రైతు బీమా పథకం అమలుకు వ్యవసాయశాఖ రైతు సమన్వయ సమితుల సహకారాన్ని తీసుకోనుంది.

ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితుల సహకారం ఎలా ఉండాలన్నది సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశనం చేయనున్నారు. ఈ క్రమంలో మండల రైతు సమితుల సమన్వయకర్తలు, జిల్లా సమితుల సమన్వయ కర్తలనూ సమావేశానికి ఆహ్వానించారు.  3వేల మందికిపైగా సమావేశానికి హాజరు కానున్నారు.  రాష్ట్రంలోని జిల్లా రైతు సమన్వయ సమితుల సమన్వయకర్తలకు ఆయా జిల్లాల వ్యవసాయ కార్యాలయాల్లో ఒక గదిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖరీఫ్‌ సీజన్‌ లో 2 నెలల పాటు జిల్లా రైతు సమితి సమన్వయకర్తలకు వాహన సదుపాయాన్నీ కల్పించాలని రైతు సమితి కార్పొరేషన్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates