రేపు సాయంత్రం ఎంసెట్ ఫలితాలు

emcetతెలంగాణ ఎంసెట్ ఫ‌లితాలను రేపు(శనివారం) విడుద‌ల చేయ‌నున్నారు. శ‌నివారం (మే-19న‌) సాయంత్రం 4 గంట‌ల‌కు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సెక్రటేరియట్ లో ఎంసెట్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయనున్నారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకోసం ఈ నెల 2 నుంచి 7 వరకు ఆన్‌లైన్ లో ఎంసెట్ ఎగ్జామ్ నిర్వ‌హించారు. ఈ ఏడాది రాష్ట్రంలో అగ్రికల్చర్, మెడికల్ విభాగాల్లో 63,653 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 58,744 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,26,547 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,19,270 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఆన్‌లైన్ ఎంసెట్ ప్రాథమిక కీని వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేశామన్నారు కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ యాదయ్య. దీనిపై ఈ నెల 15వ తేదీ వరకు 400 అభ్యంతరాలను స్వీకరించామని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates