రేపు 11.30కు టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజారిటీతో విజయం సాధించింది. పార్టీ ఎమ్మెల్యేలతో రేపు డిసెంబర్ 12 బుధవారం.. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు సమావేశం కానున్నారు. పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో శాసన సభా పక్ష నాయకుడిని ఎన్నుకుంటారు. టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా కేసీఆర్ ను ఎన్నుకోవడం లాంఛనం కానుంది. తెలంగాణ భవన్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు సీఎం కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates