రేపే ఉజ్జయని మహంకాళి జాతర : అమ్మవారికి బంగారు బోనం

ఆషాడ బోనాలతో భాగ్యనగరం కొత్త శోభను సంతరించుకుంది. ఇందులో భాగంగానే రేపు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర కన్నుల పండువగా జరుగనుంది.  అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు.ఇక జాతరలో ప్రధాన ఘట్టంగా రంగం వైభవంగా జరగనుంది. ఇందులో అమ్మవారు చెప్పే భవిష్య వాణి కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు.

ఈసారి అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నారు. అందుకోసం మానేపల్లి జ్యువెల్లర్స్ బంగారు బోనాన్ని తయారు చేస్తుంది. దాదాపు వర్క్ మొత్తం కంప్లీట్ అయిందని.. ఎల్లుండి ఉదయం దేవస్థానానికి అప్పగిస్తామని చెబుతున్నారు మానేపల్లి జ్యువెల్లర్స్ ఎండీ గోపి. 2వందల ఏళ్ల చరిత్రలో తొలిసారిగా అమ్మవారికి బంగారు బోనం సమర్పించబోతున్నారు. దాదాపు 2కేజీల 6 వందల 50 గ్రాముల బంగారంతో బోనం, కలశం, దీప ప్రమిద తయారు చేశారు. ఈ బంగారు బోనాన్ని తయారు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లుమానేపల్లి జ్యువెలర్స్ ఎండీ గోపీ తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates