రేపే కర్ణాటకలో కొత్త మంత్రివర్గం

karnatakaరేపు కొలువుతీరనుంది కర్ణాటకలో కొత్త మంత్రివర్గం. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం 34 మంత్రి పదవుల్లో కాంగ్రెస్‌కు 22, జేడీఎస్‌కు 12 దక్కనున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ నుంచి 22 మంది, జేడీఎస్ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు రేపు మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు వెల్లడించారు సీఎం కుమారస్వామి. జేడీఎస్ నుంచి 3 పదవులను ఖాళీగా ఉంచనున్నట్లు సీఎం తెలిపారు.

హోం, నీటిపారుదల, ఆరోగ్యం, వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖలతో పాటు పలు శాఖలు కాంగ్రెస్‌కు దక్కాయి. ఆర్థిక శాఖ, ఎక్సైజ్, ప్రజా వ్యవహారాలు, విద్యా, పర్యాటక శాఖతో పాటు రవాణా శాఖ పదవులు జేడీఎస్‌కు దక్కాయి. తమ ఎమ్మెల్యేల్లో బేధాభిప్రాయాలు ఉన్నట్లు వచ్చిన వార్తలను కుమారస్వామి ఖండించారు. రెండు వారాల క్రితం కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇక మంత్రి పదవుల పంపకానికి సంబంధించి జూన్ 1న కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ఒప్పందం కుదిరింది.

Posted in Uncategorized

Latest Updates