రేపే పోలింగ్.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన EC

హైదరాబాద్: రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాల్లో రేపు(డిసెంబర్ 7) పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 32,185 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన చత్తీస్ గఢ్ సరిహద్దులో ఉన్నసిర్పూర్,చెన్నూరు,బెల్లంపల్లి,మంచిర్యాల,అసిఫాబాద్,మంథని,భూపాలపల్లి,ములుగు,పినసాక,ఇల్లందు,కొత్తగూడెం,అశ్వారావుపేట,భద్రాచలంలో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకే జరగనుంది.

ఎన్నికలకు సంబంధించి ఈసీ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ప్రతి పోలింగ్ స్టేషన్ లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బందోబస్తుకు సంబంధించి రాష్ట్ర పోలీసులకు తోడుగా కేంద్ర బలగాలు, ఇతర రాష్ట్రాల పోలీసులు విధులు నిర్వహించనున్నారు. ఇక రాష్ర్టంలో మొత్తం ఓటర్లు 2,80,64,684 ఉంటే వారిలో పురుష ఓటర్లు 1,41,56,182 ఉండగా మహిళా ఓటర్లు 1,39,05,811 గా ఉన్నారు. అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకర్గం శేరిలింగంపల్లి(5,75,541) కాగా, తక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా భద్రాద్రి(1,37,319) నిలిచింది. డిసెంబర్ 11న కౌంటింగ్ జరగనుంది.

 

Posted in Uncategorized

Latest Updates