రేపే విడుదల : కాలా మూవీపై స్టే కు సుప్రీం నిరాకరణ

KALAసూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కాలా మూవీపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కాలా మూవీ విడుదలపై స్టే ఇవ్వాలని కోరుతూ వేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రతి ఒక్కరూ మూవీ విడుదల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని, ఈ సమయంలో సినిమా విడుదల విషయం తాము జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు తెలిపింది.మరోవైపు కర్ణాటకలో కాలా మూవీకి వ్యతిరేకంగా కన్నడ పరిక్షణ వేదిక, మరికొన్ని కన్నడ సంఘూలు కాలా మూవీ విడుదలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గురువారం(జూన్-7) న కాలా మూవీ విడుదల కానుంది. కర్ణాటకలో కాలా మూవీని ప్రదర్శిస్తున్న ధియేటర్లకు పోలీస్ సెక్యూరిటీ కల్పించాలని మంగళవారం కర్ణాటక హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. కావేరి జలాల పంపిణీపై రజనీ అభ్యంతరకరమైన కామెంట్లు చేశారంటూ కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు కన్నడ సంఘూలు ఇప్పటికే అల్టిమేటం జారీ చేశారు.

Posted in Uncategorized

Latest Updates