రేపే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాంలలో ఎన్నికలు జరిగాయి. రేపు (మంగళవారం) ఫలితాలు వస్తాయి. ఈ ఐదు రాష్ట్రాల ఫలితాల ఆధారంగా భావి భారత రాజకీయాలు ఎటువైపు వెళ్లనున్నాయనేది దాదాపు స్పష్టం కానుంది. 2019లో ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపుతారనే విషయంపై కొంత క్లారిటీ వస్తుంది. మంగళవారం (రేపు) ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కొద్ది గంటల్లో ఏ పార్టీ గెలుస్తుందనే విషయం తెలిసే అవకాశముంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఫలితాలపైనే… 2019లో లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండనున్నాయనే దానిపై లెక్కలు వేసుకోవచ్చు. అలాగే దేశ ప్రజల అభిప్రాయం కొంత తెలుసుకునే అవకాశం కూడా ఉంది.

Posted in Uncategorized

Latest Updates