రేపే TRT : అభ్యర్థులకు సూచనలు

TRTఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు జరిగే టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్ (TRT)కి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. పరీక్ష సందర్భంగా అభ్యర్థులకు వెబ్ సైట్లో పలు సూచనలు ఇచ్చారు. పరీక్ష సమాయానికి 45 నిమిషాల ముందుగానే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తామని  వెల్లడించింది TSPSC.  అభ్యర్థుల కోసం పలు సూచనలు చేసింది TSPSC .

మార్నింగ్ పరీక్ష రాసే వారు 9:15 గంటలకే, మధ్యాహ్నం పరీక్ష రాసేవారు1:45 గంటలకే పరీక్ష హాల్లోకి వెళ్లాలి. హాల్‌టికెట్‌తోపాటు ఏదేని గుర్తింపు కార్డు పాస్‌ పోర్టు, పాన్‌ కార్డు, ఓటరు ఐడీ, ఆధార్, ప్రభుత్వ ఉద్యోగి అయితే ఐడీ కార్డు వెంట తీసుకెళ్లాలి. పరీక్ష పూర్తయ్యే 150 నిమిషాల వరకు బయటకెళ్లడానికి వీల్లేదు. పూర్తయ్యాక బయటకు వెళ్లేప్పుడు తమ వద్ద ఉన్న పెన్, రఫ్‌ పేపర్లు ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి. అభ్యర్థి హాల్‌ టికెట్‌లో ఫొటో సరిగ్గా కనిపించకపోతే అభ్యర్థి తన రెండు పాస్‌ పోర్టు సైజు ఫొటోలను వెంట తీసుకెళ్లాలి. అభ్యర్థికి కేటాయించిన కంప్యూటర్‌ స్క్రీన్‌పై అతని ఫొటో పేరుతో సహా వ్యక్తిగత వివరాలు ఉంటాయి. ఏమైనా తేడా ఉంటే ఇన్విజిలేటర్‌కు తెలియజేయాలి.  మొబైల్, ట్యాబ్, పెన్‌డ్రైవ్, బ్లూటూత్, వాచ్, క్యాలిక్యులేటర్, లాగ్‌ పట్టికలు, పర్స్, నోటు పుస్తకాలు, విడి పేపర్లు, రికార్డింగ్‌ పరికరాలు వెంట తెచ్చుకోకూడదు. బంగారు ఆభరణాలు వెంట తెచ్చుకోవద్దు. మెహందీ, ఇంక్‌ను చేతులు, పాదాలపై పెట్టుకోవద్దు. పరీక్ష సమయంలో కీబోర్డును తాకవద్దు. మౌస్‌ను ఉపయోగించి సమాధానాలు క్లిక్‌ చేయాలని సూచించింది TSPSC.

CBRT అభ్యర్థులకు సూచనలివీ.. 
– ఎగ్జామ్ సెంటర్ లోకి మార్నింగ్ పరీక్షరాసే వారు 8.30 నుంచి,  మధ్యాహ్నం పరీక్షరాసేవారిని 1:45 గంటలకే హాలులోకి వెళ్లాలి.
–  ఎగ్జామ్ సెంటర్ లోనే సూఫ్టీ కోసం అభ్యర్థి ఫొటో, ఫింగర్ ఫ్రింట్ ను తీసుకుంటారు.
–  ఒక ఎగ్జామ్ సెంటర్ లో 100కు పైగా కంప్యూటర్లు ఉంటే రెండు నమోదు కేంద్రాలు ఉంటాయి.
– ఇన్విజిలేటర్లు అభ్యర్థి వివరాలను నమోదు కేంద్రంలో తనిఖీ చేసిన తరువాతే కంప్యూటర్‌ వద్దకు పంపిస్తారు. ఆ తరువాత ఇన్విజిలేటర్‌ సూచనల కోసం వేచి ఉండాలి.
–  సమాధానాలు ఇచ్చేందుకు కేవలం కంప్యూటర్‌ మౌస్‌ మాత్రమే వినియోగించాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ కీబోర్డును తాకరాదు. పెన్‌, సమాధానాల గుర్తింపు కోసం వినియోగించిన చిత్తుకాగితాలను ఇన్విజిలేటర్‌కు ఇచ్చేయాలి.
– ఎగ్జామ్ సమయం ముగిసే వరకు హాలు విడిచి వెళ్లేందుకు అనుమతించరు. కంప్యూటర్‌ లాగిన్‌ తెరపై అభ్యర్థి పర్సనల్ వివరాలు, ఫొటో కనిపిస్తాయి.
–  జవాబులను ఎప్పటికప్పుడు సేవ్‌చేసుకుని తరువాత పేజీకి మౌస్‌ సహాయంతో ముందుకు వెళ్లాలి. ఒక ప్రశ్నకు సమాధానమివ్వడంలో అభ్యర్థికి సందేహాలు ఉంటే పునరాలోచన ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ 
టీఆర్‌టీలో ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహించనున్న పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లను TSPSC వెబ్‌సైట్లో పొందుపరిచింది. ఈనెల 26న జరగాల్సిన పరీక్షలకు శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి లింకు అందుబాటులోకి వస్తుందని సూచించింది. ఈనెల 24న జరిగే పరీక్షలకు ఇప్పటికే భాషాపండితులు (తెలుగు)కు 15,043 మంది, స్కూల్‌అసిస్టెంట్‌ (తెలుగు)కు 12,512 మంది.. ఈనెల 25 జరిగే ఎస్జీటీ (తెలుగు)కు 41,921 మంది, ఎస్జీటీ (ఇంగ్లిష్‌)కు 24,867 మంది ప్రవేశపత్రాలు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని ఒక ప్రకటనలో వెల్లడించింది.

ప్రత్యేక హెల్ప్‌లైన్‌
TRTఖి హాజరుకానున్న అభ్యర్థుల కోసం TSPSC   ఆఫీసులో కమిషన్‌ సిబ్బంది, CGG ఐటీ  నిపుణులతో కలిసి ప్రత్యేక TRT హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసింది. అభ్యర్థుల సందేహాలు తీర్చేందుకు, ఫిర్యాదులను స్వీకరించేందుకు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6.30 వరకు ఈ కేంద్రం పనిచేస్తుందని కమిషన్‌ తెలిపింది. ఈ హెల్ప్‌డెస్క్‌ పరీక్షలు ముగిసేవరకు అందుబాటులో ఉంటుందని, అభ్యర్థులు ఫ్రీగా 83339 23740 నెంబరు లేదా helpdesk@tspsc.gov.in  ఈ-మెయిల్‌ ద్వారా హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలని సూచించింది.

 

Posted in Uncategorized

Latest Updates