రేప్ కేసులో బిషప్ ములక్కల్ కు బెయిల్ మంజూరు

కేరళ : నన్ రేప్ కేసులో రోమన్ క్యాథలిక్ బిషప్ ఫ్రాంకో ములక్కల్ కు కండిషనల్ బెయిల్ మంజూరైంది. కేరళ పర్యటన సమయంలో నన్ పై పలుమార్లు అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై ఆయనను పోయిన నెల(సెప్టెంబర్)లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయ్యింది. మెజిస్ట్రేట్ కోర్టు.. బెయిల్ పిటిషన్ ను తిరస్కరించడంతో… హైకోర్టుకు వెళ్లాడు బిషప్ ములక్కల్. కొన్ని షరతులు విధిస్తూ… చర్చి ఫాదర్ కు బెయిల్ మంజూరు చేసింది కేరళ హైకోర్టు.

కోర్టు ఆర్డర్ ఇచ్చేంతవరకు ఆయన కేరళలో అడుగుపెట్టకూడదు. రెండు వారాల్లో ఒక్కసారి మాత్రమే.. అది కూడా శనివారాల్లో మాత్రమే ఆయన సంబంధిత విచారణ అధికారిని కలిసేందుకు కేరళ రావొచ్చు. విదేశాలకు పారిపోకుండా ఆయన పాస్ పోర్టును కేరళ పోలీసులకు సరెండర్ చేయాల్సి ఉంటుందని కోర్టు కండిషన్లు పెట్టింది.

యాభై నాలుగేళ్ల బిషప్ ములక్కల్ .. 45 ఏళ్ల వయసున్న నన్ ను పలుమార్లు రేప్ చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. చర్చ్ అథారిటీస్ పట్టించుకోవడం లేదంటూ.. బాధితురాలు పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చింది. ఆమె చెప్పినట్టు చేయనందుకే తనపై తప్పుడు కేసు పెట్టిందంటూ ఆరోపణలు తప్పుపట్టాడు ములక్కల్. ఈ కేసు సంచలనం రేపడంతో… జలంధర్ లో ఉండే మతాధికారి… ములక్కల్ ను బిషప్ బాధ్యతలనుంచి తొలగించారు. అరెస్టైన తర్వాత.. పోలీసుల కస్టడీలో విచారణ ఎదుర్కొన్న ములక్కల్.. హైకోర్టు ఆదేశాలతో కండిషనల్ బెయిల్ దక్కించకున్నాడు.

Posted in Uncategorized

Latest Updates