రేప్ చేస్తే మరణ శిక్ష..చట్టం తెస్తామన్న జమ్మూ సీఎం

mehbooba actవరుస రేప్ ఘటనలకు నిరసనగా ఢిల్లీలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. ఇండియా గేట్ దగ్గర నిర్వహించిన కార్యక్రమంలో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. మహిళలు, బాలికపై దాడులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా కేంద్రం స్పందించాలన్నారు రాహుల్. కథువా రేప్ కేసులో నిందితులకు బీజేపీ నేతలు అండగా ఉన్నారన్నారు కాంగ్రెస్ నేత ఆజాద్. వారిపై చర్యలు తీసుకోవడంలో కేంద్రం ఫెయిలైందన్నారు కాంగ్రెస్ నేతలు. అంతకు ముందు… జమ్మూకశ్మర్ లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది.

హత్యకు ముందు… బాలికను దారుణంగా వేధించినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ ఇచ్చి, మూడు రోజుల పాటు అత్యాచారం చేశారని… రాయితో తలపై మోది హత్య చేశారని పోలీసులు FIR నమోదు చేశారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.  కేంద్రమంత్రి వీకే సింగ్ ఈ ఘటనపై స్పందించారు. మన నిస్సహాయతతోనే అసిఫాను ఓడించామన్నారు. స్థానిక బీజేపీ నేతలు నిందితులకు మద్దతుగా ఉన్నారని ప్రచారం జరుగుతుండగా… వారికి వ్యతిరేకంగా వీకే సింగ్ ట్వీట్ చేశారు.

అసిఫాకు న్యాయం చేస్తామన్నారు జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ. మైనర్లపై అత్యాచారం చేసే వారికి మరణ శిక్ష విధించేలా కొత్త చట్టాన్ని తెస్తామని ట్వీట్ చేశారు. అసిఫా లాగా మరో బాలిక ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు ముఫ్తీ. రేప్ ఘటనలను రాజకీయం చేయడం తగదన్నారు డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్. రేప్ ఘటనలో బాధితురాలికి న్యాయం జరగాలని… నేరస్తులకు మతంతో లింక్ చేయడం కరెక్ట్ కాదన్నారు. కథువా ఘటనపై సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ నడుస్తోంది. జస్టిస్ ఫర్ అసిఫా పేరుతో బాలికకు న్యాయం చేయాలని పలువురు ప్రముఖులు కూడా ట్వీట్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates