రేవంత్‌ ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు..కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి ఇంట్లో ఐటీ ఆధికారుల సోదాలు ముగిశాయి. గురువారం ఉదయం గంటలకు మొదలైన సోదాలు శనివారం(సెప్టెంబర్-29) తెల్లవారుజామున 2:30 గంటల వరకు కొనసాగాయి. 44 గంటల పాటు కొనసాగిన తనిఖీల్లో రేవంత్‌రెడ్డి, అతని భార్య గీతను అధికారులు విచారించారు.  రేవంత్‌ ఇంటినుంచి పలు కీలక డాక్యుమెంట్లు ఐటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

సోదాలు ముగిసిన అనంతరం స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లపై రేవంత్‌, గీతలతో సంతకాలు తీసుకున్నారని, మొత్తం మూడు సూట్‌ కేసుల్లో డాక్యుమెంట్లను తీసుకెళ్లారనీ సమాచారం. సోదాల కోసం ఢిల్లీ, బెంగళూరు నుంచి వచ్చిన అధికారుల్లో కొందరు శుక్రవారం తెల్లవారుజామున రేవంత్ ఇంటి నుంచి వెళ్లిపోగా.. వారి స్థానంలో మరో ముగ్గురు అధికారులు వచ్చారు. ప్రధానంగా స్థిర, చరాస్తుల విషయంలో ఐటీశాఖకు చూపించిన వివరాలు, ఆదాయానికి మించి ఉన్న ఆస్తులు, అమెరికా, సింగపూర్, హాంకాంగ్, దుబాయ్ తదితర దేశాల్లోని బ్యాంకు ఖాతాల్లోకి అక్రమంగా మనీ ట్రాన్సక్షన్స్ కి సంబంధించిన అంశాలపై రేవంత్, ఆయన కుటుంబీకులను ఐటీ అధికారులు క్షుణ్ణంగా ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.

Posted in Uncategorized

Latest Updates