రేవంత్ రెడ్డికి వందల కోట్ల అక్రమాస్తులు!.. ఐటీ అంచనా

హైదరాబాద్ : రేవంత్ రెడ్డి స్టేట్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొన్ని వందల కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టారని ఇన్ కం టాక్స్  డిపార్ట్ మెంట్ అంచనా వేస్తోంది. రేవంత్ కుటుంబసభ్యులు, బినామీ పేర్లతో నమోదై ఉన్న ఆస్తులు, భూములు, కంపెనీలు.. జరిపిన మనీ లాండరింగ్ లావాదేవీలు, కంపెనీల్లో వాటాలపై వివరాలు సేకరిస్తున్నట్టు మీడియాకు ఓ అజ్ఞాత లేఖ వచ్చింది. అందులో ఉన్న సమాచారం ప్రకారం..  రేవంత్ రెడ్డిపై పలు చట్టాల కింద కేసులు నమోదుచేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బ్లాక్ మనీ, ఇన్ కం ట్యాక్స్ చట్టం 2015, ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ చట్టం 2002 , ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ట్రాన్సాక్షన్ ఆక్ట్ 1988, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 లను ప్రయోగించే అవకాశాలున్నాయి.

రేవంత్ రెడ్డిపై పలు అభియోగాలు నమోదైనట్టు సమాచారం అందుతోంది. 2014 ఫిబ్రవరి 25న సింగపూర్ లోని బహుళ అంతస్తుల అమ్మకంలో 20 లక్షల సింగపూర్ డాలర్లు పొందినట్లు … 2014 ఫిబ్రవరి 25న కౌలాలంపూర్ వాసి మురళీ రఘువరన్ దగ్గరి నుంచి రూ.60 లక్షలు పొందినట్టు వివరాలు సంపాదించారు దర్యాప్తు జరుపుతున్న అధికారులు. ఈ రెండు లావాదేవీలపై సమాచారం సేకరించిన ఐటీ, ఈడీ అధికారులు.. ఎన్నికల అఫిడవిట్ లో కానీ ఐటీ రిటర్న్స్ లో వాటి సమాచారాన్ని రేవంత్ రెడ్డి చూపలేదని తేల్చారు.

లెక్కలేనంత డబ్బు పెట్టి వివిధ ఖాతాల ద్వారా సింగపూర్, మలేసియాలలో రేవంత్ ఆస్తులు కూడబెట్టారని.. యాంటీ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 1988 ఉల్లంఘించినట్టు…. తన అనుచరులు, బినామీలు, బంధువుల పేర్లతో షెల్ కంపెనీలు సృష్టించి, కేవలం రేవంత్ రెడ్డి లబ్ధి పొందినట్టు.. అధికారులు ఆధారాలు సేకరించినట్టు సమాచారం.

వ్యవసాయ భూములు, కమర్షియల్ ప్లాట్లు, బిల్డింగ్ లు, ఇతర ఆస్తులు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యల పేరు మీద, బినామీల మీద ఉన్నట్లు గుర్తించారు అధికారులు. కొన్ని భూముల కొనుగోలు లావాదేవీల వ్యవహారం ఐటీ రిటర్న్స్ లో కానీ, ఎన్నికల అఫిడవిట్ లో రేవంత్ పొందుపరచలేదని అంటున్నారు ఐటీఅధికారులు. అతని హోదా ఉపయోగించి అతను, అతని బంధువుల పేరుతో అక్రమ పద్ధతిలో భారీ గా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి. 2009 నుంచి 2014 వరకు, 2014 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి సంపాదించిన పలు ఆస్తులు… ఆదాయానికి మించి ఉన్నాయని అధికారులు గుర్తించారు.

రేవంత్ రెడ్డి క్రిమినల్ ఆక్టివిటీస్ చేసినట్టుగా కూడా ఆధారాలు సేకరించినట్టు సమాచారం. కొడంగల్ నియోజక వర్గంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా ఎన్నికైన దశ నుంచే అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి. రాజకీయ అండ తో.. వ్యక్తిగత లబ్ధి పొందటమే కాకుండా భారీగా ఆస్తులు సేకరించినట్లు రేవంత్ రెడ్డిపై అభియోగాలున్నాయి.

2014 లో రేవంత్… తన దగ్గరున్న నల్లధనంతో మలేషియాలోని ఆస్తులను కొనుగోలు చేసి వివిధ బ్యాంకు అకౌంట్ల ద్వారా తిరిగి వైట్ మనీ పొందినట్టు చెబుతున్నారు. 2014 ఫిబ్రవరి 25న రేవంత్ రెడ్డి హాంకాంగ్ బ్యాంక్ అకౌంట్ లో 60 లక్షల మలేషియన్ రింగెట్స్ ను జమ చేసినట్లు ఆరోపణలున్నాయి. కౌలాలంపూర్ వాసి రఘువరన్ మురళి RHB బ్యాంక్ ద్వారా రేవంత్ కు డబ్బు అందినట్లు … విదేశాల నుంచి వచ్చిన సొమ్ము ఇండియన్ కరెన్సీలో 10కోట్లకు పైగా విలువ చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. విదేశీ లావాదేవీల వ్యవహారంలో కౌలాంలంపూర్ రఘువరన్ మురళికి రేవంత్ కి మధ్య చాలా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు వినికిడి. ఈ విదేశీ లావాదేవీలన్నీ 2014 ఎన్నికలకు ముందే జరిగినప్పటికీ.., వాటిని ఎన్నికల అఫిడవిట్ లో పొందుపర్చలేదని గుర్తించారు అధికారులు.

రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి ద్వారా హవాలా రూపంలో దుబాయ్ నుంచి సొమ్ము పొందినట్లు అధికారులు గుర్తించారు. వియ్యంకుడు వెంకట్ రెడ్డి( రేవంత్ కూతురు నైమిసా రెడ్డి మామయ్య) పేరుతో నెక్సెస్ ఫీడ్ సంస్థను స్థాపించి ఆంధ్రప్రదేశ్ లో భారీ మొత్తంలో లావాదేవీలు జరిపిన వివరాలను ఐటీ, ఈడీ అధికారులు సేకరించారు.  నెక్సెస్ ఫీడ్ కంపెనీ నుంచి రేవంత్ రెడ్డి ఖరీదైన పోర్షే కారు (నం. AP37CQ0999) పొందినట్లు గుర్తించారు. ఫెమా రెగ్యూలేషన్ ఆక్ట్ ఉల్లంఘించి.. బినామీ లావాదేవీలు, లోన్స్ డైవర్షన్, మనీ ల్యాండరింగ్ ఆక్టివిటీస్ చేసినట్టు గుర్తించారు.

Posted in Uncategorized

Latest Updates