రేవంత్ రెడ్డిపై ఫైర్ అయిన బాల్కసుమన్

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్. రేవంత్‌ రెడ్డి నోరు అదుపులో పెట్టుకు మాట్లాడాలని, నోరుంది కదా అని ఏదిబడితే అది మాట్లాడితే బయట తిరగలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా చేసిన తప్పులు ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని బాల్కసుమన్ అన్నారు. రేవంత్‌ రెడ్డి తనకుతాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని, ఐటీ నోటీసులతో టీఆర్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. నిప్పులాగా బతుకుతున్న కేసీఆర్‌ కుటుంబం గురించి మాట్లాడే అర్హత రేవంత్‌ కు లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి కేసీఆర్‌ అన్నారు . కేసీఆర్‌ది ఉద్యమ కుటుంబం.. ఆయన తెలంగాణ జాతిపిత అని సుమన్‌ అన్నారు. కులాల పేరుతో రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రేవంత్‌రెడ్డి నువ్వు స్వాతిముత్యం కమల్ హాసన్‌ వి కాదు.. విశ్వరూపం కమల్ హాసన్‌ వి అని బాల్కసుమన్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఏజెంట్‌ రేవంత్‌రెడ్డి అని సుమన్ అన్నారు. ఇష్టంవచ్చినట్టు మాట్లాడితే తోలుతీస్తాం…ఖబడ్దార్‌ అంటూ రేవంత్ రెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు బాల్క సుమన్.

Posted in Uncategorized

Latest Updates