రేవారీ గ్యాంగ్ రేప్ కేసు…కీలక నిందితుడైన ఆర్మీ జవాన్ అరెస్ట్

రేవారీ గ్యాంగ్ రేప్ కేసులో కీలక నిందితులైన ఆర్మీ జవాను పంకజ్, మనీష్ లను ఆదివారం(సెప్టెంబర్-23) హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్…. 11 రోజుల తర్వాత మహేంద్రగఢ్‌ లోని సంతాలిలో ఈ ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు డీజీపీ బీఎస్ సంధు తెలిపారు. ఈ కేసులో నిందితులందరూ అరెస్ట్ అయినట్లు తెలిపారు

ఈ నెల 12న కోచింగ్ సెంటర్‌ నుంచి ఇంటికి వెళ్లేందుకు బస్టాప్ లో బస్ కోసం ఎదురుచూస్తోన్న సీబీఎస్ఈ టాపర్, ప్రస్తుతం డిగ్రీ సెకండియర్ చదువుతోన్న విద్యార్థినిని కారులో వచ్చిన నిందితులు కిడ్నాప్ చేసి……నగర శివార్లకి తీసుకెళ్లి యువతిపై గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. తరువాత స్పృహ కోల్పోయిన బాధిత యువతిని ఓ బస్టాప్ దగ్గర వదిలేసి పరారయ్యారు. నిందితులందరూ తమ ఊరి వారేనని బాధితురాలు తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates