రేషన్ డీలర్ల సమ్మె విరమణ

rationdealersaరాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగిన రేషన్ డీలర్లు తమ సమ్మెను విరమించారు. మంగళవారం (జూలై-3) పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్, మంత్రి లకా్ష్మరెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, పౌర సరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్ పెద్ది సుదర్శన్‌ రెడ్డిలతో జరిపిన రేషన్ డీలర్ల చర్చలు ముగిశాయి. ఈ సందర్భంగా సమ్మె విరమిస్తున్నట్లు రేషన్ డీలర్లు ప్రకటించారు. డీడీలు కట్టేందుకు సమయం పొడిగిస్తామని రేషన్ డీలర్ల గౌరవాధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రేషన్ డీలర్లకు సంబంధించిన అనేక సమస్యలు పరిష్కరించామని పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు.డీలర్ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

మా సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ మ్రంతులు హామీ ఇచ్చారని తెలిపారు రేషన్ డీలర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ బాబు. అతి త్వరలో తమ డిమాండ్లు పరిష్కారమవుతామని ఆశిస్తున్నామని.. కనీస గౌరవ వేతనం, పాత బకాయిలు, హెల్త్ కార్డులపై ప్రభుత్వానికి విన్నవించామని చెప్పారు. ఈ డిమాండ్లతో పాటు డీడీలు కట్టేందుకు కొంత సమయం అడిగామని.. సమస్య పరిష్కారం కోసం రేషన్ డీలర్ల గౌరవ అధ్యక్షురాలు పద్మా దేవేందర్‌రెడ్డి తీవ్రంగా కృషి చేశారని చెప్పారు రేషన్ డీలర్ల ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు. సీఎం కేసీఆర్ కు తాము వ్యతిరేకం కాదని.. తప్పని పరిస్థితుల్లోనే సమ్మె చేశామని వివరించారు రేషన్ డీలర్లు.

Posted in Uncategorized

Latest Updates