రైజర్స్ కి బ్రేక్ : హైదరాబాద్ పై పంజాబ్ పంజా

iplసన్ రైజర్స్ హైదరాబాద్ దూకుడుకు బ్రేకు పడింది. హ్యాట్రిక్ విజయాలతో జోష్ మీదున్న హైదరాబాద్ కు తొలి ఓటమి ఎదురైంది. కింగ్స్  ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో.. సన్ రైజర్స్  15 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ ఇచ్చిన 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఫెయిల్ అయింది హైదరాబాద్ టీమ్. 20ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 178 పరుగులే చేయగలిగింది. మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్  బ్యాట్స్ మెన్ అద్భుతంగా ఆడారు. క్రిస్ గేల్  రెచ్చిపోయి.. పరుగుల వరద పారించాడు. 11సిక్సర్లతో అదరగొట్టాడు.

సన్ రైజర్స్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ బౌలింగ్ లో వరుసగా  నాలుగు సిక్సర్లు కొట్టి తన బ్యాటింగ్ పవర్ ను చూపించాడు గేల్.  63 బంతుల్లో  104 పరుగులు సాధించాడు. ఇది ఈ ఐపీఎల్  సీజన్ లోనే తొలి శతకంగా నమోదైంది. 194పరుగుల టార్గెట్ ను చేధించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ కు మొదటి నుంచే కష్టాలు మొదలయ్యాయి. తొలి బంతికి శిఖర్  ధావన్ గాయపడటంతో రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత  వికెట్లు ఉన్నప్పటికీ మొదటి నుంచి హైదరాబాద్ బ్యాట్స్ మెన్ దూకుడుగా ఆడలేకపోయారు. సిక్సులు, ఫోర్లపై దృష్టి పెట్టకపోవడంతో.. పెద్దగా పరుగులు సాధించలేకపోయారు. దాంతో 178పరుగులే చేయగలిగింది హైదరాబాద్ టీమ్.

Posted in Uncategorized

Latest Updates