రైతుకి శుభవార్త : వరి మద్దతు ధర రూ.200 పెంపు

vari rateఅన్నదాతలకు కాస్త ఊరట కలిగించే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. వరికి రూ.200 పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2018-19 సంవత్సరానికిగాను క్వింటాల్ కు ఈ ధర వర్తిస్తుంది. ప్రస్తుతం క్వింటా ధాన్యం రూ.1,550గా ఉంది. పెంచిన 200 రూపాయలతో.. క్వింటా మద్దతు ధర రూ.1750కి చేరింది.

వరితోపాటు మరో 13 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచడానికి అంగీకరించింది కేంద్ర ప్రభుత్వం. కనీస మద్దతు ధరను ఉత్పత్తి ఖర్చుకు కనీసం ఒకటిన్నర రెట్లు చేస్తామని ఈ మధ్యే  ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం తెలుపుతామని ఆయన చెప్పారు.

ఈ ఏడాది బడ్జెట్‌ లోనూ కేంద్రం ఇదే విషయాన్ని స్పష్టంచేసింది. సాధారణంగా పంట వేసే ముందే కేంద్రం కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది. దీనిని బట్టి రైతులు ఏం పంట వేయాలన్నది నిర్ణయం తీసుకుంటారు. వరిపై కనీస మద్దతు ధరను భారీగా పెంచడం వల్ల దేశంలో ఉత్పత్తి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 2017-18లో వరి పంట ఉత్పత్తి 11.1 కోట్ల టన్నులతో కొత్త రికార్డును అందుకుంది.

Posted in Uncategorized

Latest Updates