రైతును రాజు చేయడమే ప్రభుత్వం లక్ష్యం : కేసీఆర్

KCRరైతును రాజు చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం కేసీర్. సోమవారం (ఫిబ్రవరి-26) కరీంనగర్ లో ఏర్పాటుచేసిన  రైతు సమితి సభలో మాట్లాడిన సీఎం.. రైతు సమన్వయ సమితుల సభ్యులకు దిశానిర్దేశం చేశారు . రైతు సమన్వయ సమితిలో అనుకున్నది జరగాలంటే చాలా పటిష్టంగా మొండిగా పని చేయాలన్న సీఎం కేసీఆర్..  రైతు సమితి చర్య ప్రభుత్వం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తెలుసుకోవాలని సూచించారు.

2001లో తెలంగాణ వస్తుందంటే ఎవ్వరూ నమ్మలేదని, చివరికి పట్టుదలతో తెలంగాణను సాధించుకున్నామన్నారు. అందరం కలిస్తేనే గమ్యానికి చేరుకుంటామన్నారు. దేశంలోనే ఉన్నటువంటి రేగడి భూముల్లో 40 కోట్ల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారని తెలిపిన కేసీఆర్.. దేశంలో రైతు ఆత్మహత్యలు జరగకూడదన్నారు.  స్వతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్, బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన అసమర్థతతోనే రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు.  కాశ్మీర్ నుంచి కన్నాకుమారి వరకు దేశంలో ఎన్నో నదులు ఉన్నాయని, మంచి జల సంపద ఉందన్నారు. తెలంగాణలో నాలుగు రకల నేలలు ఉన్నాయని, బంగారం పండే నేలలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. మరి మన దేశానికి ఈ దుస్థితి ఎంటని ప్రశ్నించారు సీఎం.

కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలని..ఇందుకోసం ఒక 20 సార్లు ప్రధానికి లెటర్ పెట్టినట్లు చెప్పారు సీఎం కేసీఆర్.  మార్చి 5 నుంచి జరగబోయే బడ్జెడ్ లో రైతాంగం కోసం గట్టిగా కేంద్రాన్ని నిలదీయాలన్నారు. తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో మనిషికి 5 గ్రాముల ఉప్పు తినాలని, అయితే మనం 20 గ్రాముల ఉప్పు తింటున్నామన్నారు.  అందుకే ఈ కోపాలు, హైబీపీలు అని ఛలోక్తులు వేశారు. సన్ ఫ్లవర్ కి  మంచి డిమాండ్ ఉందని, రైతులు పొద్దుతిరుగుడు పంట పండిస్తే మంచి లాభాలు వస్తాయన్నారు. రైతులు అన్నదాతలుగా ఉండాలి. ఇంటిముందుకు వచ్చిన వారికి అన్నంపెట్టేలా బతకాలన్నారు.

కూడు-గూడు తెలంగాణకి తొలివాకిటి అని తెలిపిన సీఎం.. తెలంగాణకి రెండు పంటుల పండించే భూములన్నాయని చక్కగా పంటలు వేసి సధ్వినియోగం చేసుకోవాలన్నారు.   రైతులు బిచ్చమడుక్కోకుండా అప్పులు లేకుండా ఉండాలన్నారు.  కరీంనగర్ లో15 చెక్ డ్యామ్ లు నిర్మించనున్నట్లు చెపపిన కేసీఆర్..  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని(నరేగా) వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరుతూ.. రైతులతో ఏకగ్రీవ తీర్మానం చేయించారు సీఎం కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates