రైతుబంధు అంటే.. ప్రజల వద్దకే పాలన : కేటీఆర్

KTRSతమది ప్రజల వద్దకే పాలన అంటున్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు. 30 పడకల ఆస్పత్రి ఏర్పాటుకి హామీ ఇచ్చారు. దేశంలోనే అన్ని రంగాల్లో తెలంగాణ ముందుకెళ్తుందన్నారు. ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్న కేటీఆర్.. అప్పటి కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం ఎంతో మంది రైతులు చనిపోయారన్నారు. ఎరువుల కోసం రైతులు ఎర్రటి ఎండల్లో లైన్ లో నిలబడలేక సొమ్మసిల్లేవారని తెలిపారు. కానీ తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్లలోనే రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టామన్నారు. రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేశామని.. ఇప్పుడు పంటకు పెట్టుబడి కింద ఎకరాకు రూ.8 వేలు ఇస్తున్నామన్నారు. 71 ఏళ్లలో 16 మంది ముఖ్యమంత్రులు చేయని పనిని అన్నదాతల కోసం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు.

రైతు వద్దకే వచ్చి చెక్కులు, పాస్ బుక్కులు ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో పాస్ బుక్కు కావాలంటే అధికారులు చుట్టు తిరిగేవారని.. ఇప్పుడు అధికారులే రైతుల దగ్గరకు వచ్చి పాస్ బుక్కులు, చెక్కులు ఇస్తున్నారన్నారు. ప్రజల వద్దకు పాలన అంటే ఇదే అన్నారు. రైతులకు లాభం చేయాలనే ఆలోచన కాంగ్రెస్ కు ఎప్పుడూ రాలేదన్నారు మంత్రి కేటీఆర్. ప్రాజెక్టులతో తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని తెలిపిన కేటీఆర్.. పంటలకు భీమా కల్పిస్తున్నామన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి దేశంలోనే ఫస్ట్ టైంగా రైతుల కోసం రూ.5లక్షల భీమా ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates