రైతుబంధు చెక్కును వెనక్కి ఇచ్చిన బాలు, నమ్రత

balu-namratha
రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వ రైతుబంధు పథకం ప్రారంభించింది. అయితే కొందరు రైతుబంధు పథకం కింద వచ్చిన డబ్బులను తిరిగి ప్రభుత్వానికి అందిస్తున్నారు. ఇందులో భాగంగా  ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రైతుబంధు పథకం కింద వచ్చిన రూ. 23,700ల చెక్కును రెవెన్యూ అధికారులకు అందజేశారు.రంగారెడ్డి షాబాద్ మండలం సోలిపేటలో బాలసుబ్రహ్మణ్యంకు 5 ఎకరాల 37 గుంటల భూమి ఉంది.

మహేశ్వరం మండలం నాగారం రెవెన్యూ పరిధిలో సినీ ప్రొడ్యూసర్ ఎలమంచలి రవిశంకర్ పేరిట రెండెకరాలు, ప్రముఖ నటుడు మహేశ్‌బాబుకు ఎకరం, ఆయన సతీమణి నమ్రతకు ఎకరం భూమి ఉంది. వీరికి ప్రభుత్వం పంట పెట్టుబడి కింద రూ.16 వేలు చెక్కులు అందుకున్నారు. శుక్రవారం(జూన్-8) బంజారాహిల్స్‌లోని తమ నివాసాల్లో మహేశ్వరం వ్యవసాయాధికారి కోటేశ్వర్‌రెడ్డి, వీఆర్వో మహేశ్‌కు చెక్కులు తిరిగి అందజేశారు.

Posted in Uncategorized

Latest Updates