రైతుబంధు వందశాతం సక్సెస్ కావాలి : కేసీఆర్

KCRపాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీ నూటికి నూరు శాతం పూర్తయ్యే వరకు అధికారులు విశ్రమించవద్దన్నారు సీఎం కేసీఆర్. రైతు బంధు పథకంపై బుధవారం (మే-23) ప్రగతి భవన్ లో అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు కేసీఆర్. జిల్లాల వారీగా ఇప్పటి వరకు ఎన్ని పాసుపుస్తకాలు పంపిణీ చేశారు, ఎంత మందికి చెక్కులిచ్చారు, మిగతా వారికి ఏ కారణంతో పంపిణీ చేయలేదనే దానిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఇప్పటివరకు జరిగిన భూమి అమ్మకం, కొనుగోళ్లకు సంబంధించిన అన్ని వివరాలు నమోదు చేసి, దాని ప్రకారం అందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు అందించాలని చెప్పారు. వందరోజులపాటు భూ రికార్డుల ప్రక్షాళన జరిగినప్పటికీ, ఇంకా కొన్ని చోట్ల రికార్డుల్లో తప్పులు దొర్లడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం. అయితే ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించినప్పుడు కొన్ని సమస్యలు తప్పవని…ఈ పరిస్థితిని సవాల్ గా తీసుకోవాలన్నారు. జూన్ నెల నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వస్తుందని, రైతులకు జీవిత బీమా పథకం కూడా అమల్లోకి వస్తుందని తెలిపారు సీఎం కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates