రైతులందరికీ రైతుబంధు,జీవిత బీమా: సీఎం కేసీఆర్ 

రైతులందరికీ రైతుబంధు, జీవిత బీమా వర్తింపజేయాలన్నారు సీఎం కేసీఆర్. శుక్రవారం(జూలై-13) ప్రగతి భవన్‌లో రైతు బీమా, భూరికార్డులకు సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం. ఒక రైతుకు ఎన్ని చోట్ల భూమి ఉన్నా.. ఎన్ని ఖాతాలు ఉన్నా ఒక పాలసీ మాత్రమే వర్తింపజేయాలని అధికారులను ఆదేశించారు.

రైతులందరి పేర్లు నమోదయ్యే వరకు నామినీ దరఖాస్తు స్వీకరించాలన్నారు. ఇప్పటి వరకు సేకరించిన వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాల్లో తప్పుల సవరణ, పేర్ల మార్పిడి స్పీడప్ చేయాలన్నారు. పేద, ధనిక తేడా లేకుండా 18 నుంచి 60 ఏళ్లున్న ప్రతి రైతు పేరు నమోదు చేయాలని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates