రైతులకు టోకరా: రూ.15 కోట్లు ఎగ్గొట్టిన దివ్య‌జ్యోతి ఎంట‌ర్‌ప్రైజెస్

erraరైతుల నుంచి సరుకులు కొనుగోలు చేసి..వారికి డబ్బులు ఇవ్వకుండా పారిపోయారు ఓ సంస్థ యజమానులు. ఆందోళన చెందిన రైతులు కలెక్టర్ ను,పోలీసు కమిషనర్ ను ఆశ్రయించారు. న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లా రూరల్ లో జరిగింది. దివ్య‌జ్యోతి ఎంట‌ర్‌ప్రైజెస్ య‌జ‌మానులు..వ్యాపారం పేరుతో కొన్నేళ్లుగా రైతులనుంచి పంట‌ల‌ను కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని రాయ‌ప‌ర్తి, కొడ‌కండ్ల‌, వ‌ర్ధ‌న్న‌పేట‌, కేసముద్రం, నెల్లికుదురు, జ‌ఫ‌ర్‌గ‌ఢ్, తిరుమ‌ల‌గిరి మండ‌లాల్లోని ప‌లు గ్రామాల్లో నేరుగా ప‌త్తి, మొక్క‌జోన్న‌, ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు వ్యాపారం చేస్తున్నారు. ప్రతీ ఏడాది లాగే ఈ సారి కూడా కొనుగోలు చేసిన పంటలకు ఏకంగా 15 కోట్ల రూపాయలకు పైడా డబ్బులు చెల్లించకుండా మోసం చేసి పారిపోయారు దివ్యజ్యోతి నిర్వాహకులు. విషయం తెలుసుకున్న పాల‌కుర్తి ఎమ్మేల్యే ఎర్ర‌బెల్లి దయాక‌ర్ రావు…రైతుల తరపున జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్ ను కలిశారు.  మోసం చేసి పారిపోయిన సంస్థ నిర్వాహకులను పట్టుకుని రైతులకు డబ్బులు ఇప్పించి సరైన న్యాయం చేయాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న కమిషనర్ త్వరలోనే పట్టుకుంటామన్నారు.

Posted in Uncategorized

Latest Updates