రైతులకు పరిహారం ఇప్పించండి : మోడీని కలిసిన పంజాబ్ సీఎం

రైతులకు పరిహారం ఇప్పించాలంటూ ప్రధానిని కలిసి విజ్ణప్తి చేశారు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్. పంటల కాల్చివేత కారణంగా వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన అమరీందర్ ఇవాళ(అక్టోబర్-18) ప్రధాని మోడీని కలిశారు. పంట కాల్చివేతలు మరింత పెరిగే అవకాలు ఉన్నందున వెంటనే దీనికి నివారణ చర్యలు చేపట్టాలని మోడీని కోరారు. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌ లో అధికారుల నియామకాల్లో 60:40 మేర ఉన్న హర్యానా, పంజాబ్ నిష్పత్తిని కదల్చకూడదని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. . దట్టమైన పొగల కారణంగా ఢిల్లీలో ప్రస్తుతం వాయుకాలుష్య స్థాయిలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. దీనికి పంజాబ్, హరియాణాల్లో పంట నూర్పిళ్ల అనంతరం వ్యర్ధాల కాల్చివేతే కారణమని భావిస్తున్నారు. పంటల కాల్చివేతపై నిషేధం ఉన్నప్పటికీ….వాటిని తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ఆర్ధిక సాయం చేయకపోవడంతో తమకు వేరేదారి లేదని రైతులు చెబుతున్నారు. శ్రీ గురు నానక్ దేవ్ జీ 550 వ జయంతి వేడుకల ప్రిపరేషన్స్ కి సహాయం చేయాలని అమరీందర్ మోడీని కోరారు.

Posted in Uncategorized

Latest Updates