రైతులకు బ్యాంకర్లు సహకరించాలి : మంత్రి ఈటల

వ్యవసాయ, అనుబంధ రంగాలకు బ్యాంకర్లు ఇస్తున్న ప్రోత్సాహం అభినందనీయమన్నారు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్. రాబోయే రోజుల్లో రైతులకు మరింత సహకారం అందించాలని బ్యాంకర్లకు విజ్ఞప్తిచేశారు రాజేందర్. నిన్న(శుక్రవారం) హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల 20వ త్రైమాసిక సమావేశంలో ఈటల మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకరించాలని బ్యాంకర్లను కోరారు. రాష్ట్రంలో మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా ఇటీవల రూ.1670 కోట్లు చెల్లించామని, వడ్డీలేకుండా రూ.734 కోట్ల రుణాలు ఇచ్చామని చెప్పారు ఆయన. ప్రభుత్వంతోపాటు బ్యాంకర్లు పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ప్రత్యేకించి వ్యవసాయ, అనుబంధ రంగాలకు మరింత ప్రోత్సాహాన్ని అందజేయాలన్నారు. తెలంగాణలో నీలి విప్లవం రానున్నదని, దీనిని దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులకు ఇతోధికంగా రుణాలిచ్చి వారికి మద్దతుగా నిలవాలని బ్యాంకర్లతోపాటు నాబార్డ్‌ ను కోరారు రాజేందర్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రుణాల విషయంలో బ్యాంకర్లు ఇబ్బందులు కలిగించరాదని కోరారు.

Posted in Uncategorized

Latest Updates