రైతులకు భరోసా: ఫసల్ బీమా

రైతుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా ఆదుకునేందుకు ఏర్పాట్లు చేసింది. అనుకోని విపత్తులు ఏర్పడి పంటకు నష్టం జరిగితే ఆదుకోవాలని నిర్ణయించింది ప్రభుత్వం. విత్తనం నాటిన దగ్గర నుంచి పంట అమ్మే వరకు నాణ్యత, కల్తీ విత్తనాలు, పురుగు మందులు, ప్రతికూల వాతావరణం చీడపీడలు, గిట్టుబాటు ధర లేకపోవడం తదితర ఎన్నో సవాళ్లను ఎదుర్కొనే రైతులకు పంటల బీమా ఆర్థిక భరోసాను కల్పిస్తోంది.

ప్రతీ ఏడాది ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం జరుగుతుంది. పంటను కష్టపడి పండించిన రైతు నష్టపోతున్నాడు. ఈ సమయంలో రైతులను ఆదుకోవడానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా వాతావరణ ఆధారిత బీమా (RWBCIS) ను కొనసాగితుంది. వానాకాలంలో నోటి చేసిన ఫై పంటలకు బీమా వర్తింపజేస్తుంది.

పంటలకు బీమా ప్రీమియాన్ని రైతు కొంత చెల్లించాలి. మిగితా సొమ్మును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా చెల్లిస్తాయి. పంటలు నష్టపోయినప్పుడు బీమా కంపెనీ ప్రతినిధులు రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు లేటెస్ట్ టెక్నాలజీతో అంచాన వేస్తారు.అగ్నిప్రమాదాలు, గాలి, వాన, వడగండ్లు, వరదలతో పంటలు నీట మునగడం, తెగుళ్లు, ప్రతికూల వాతావరణంలో కలిగే నష్టాలకు దిగుబడి ఆధారంగా గుర్తించి పరిహారాన్ని చెల్లిస్తారు. ప్రధాన పంటలు దెబ్బతినడం, నాట్లు వేయకపోవడం తదితర సమయంలో పరిహారం 25శాతం వరకు చెల్లించే అవకాశం ఉంది.

పంటలకు బీమా చేయించడం ఈజీ. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్న రైతులకు ఆయా బ్యాంకులే నిర్భంధంగా బీమా ప్రీమియాన్ని వసూలు చేస్తాయి. కౌలు రైతులు, ఇతర రైతులు బీమా చేయించాలంటే ఎంపిక చేసిన పంటలను సాగు చేస్తున్నట్లు వివరాలను అందజేయాలి. ప్రీమియం డీడీని జతపరిచి నిర్ణయించిన తేదీలోగా బ్యాంకు ద్వారా కానీ, అనుమతించిన సంస్థ ద్వారా కానీ బీమా కంపెనీకి సంబంధిత సర్టిఫికెట్లను పంపాలి.

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో వానాకాలం సీజన్‌లో వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుము, వేరుశనగ, సోయాబీన్, పసుపు పంటలను గుర్తించారు. వరి పంట సాగుకు ఆగస్టు 31లోగా, మిగితా పంటలకు జులై 31లోగా ప్రీమియం చెల్లించాలని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates