రూ.17 వేల కోట్లతో రైతు రుణమాఫీ చేశాం : కేటీఆర్

KTRరైతుబంధు తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయం అన్నారు మంత్రి కేటీఆర్. గురువారం (మే-17) రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నామాపురం గ్రామంలో రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు మంత్రి కేటీఆర్.  వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకే సీఎం కేసీఆర్ రైతు బంధు పథకం ప్రవేశపెట్టారని అన్నారు. రైతు బంధు పథకం చెక్కుల పంపిణీతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొన్నదన్నారు.

రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎక్కువ ఆత్మ సంతృప్తినిచ్చింది. గత పాలకులు రూ.200 పెన్షన్ కోసం ముప్పు తిప్పలు పెట్టిన్రని మండిపడ్డారు. తెలంగాణ వస్తే కరెంటే ఉండదని గత పాలకులు అన్నారు. 6 గంటల కోసం రైతులు ధర్నాలు చేసేవారన్నారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా అన్ని వర్గాలకు 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు కేటీఆర్. రైతులకు 17 వేల కోట్ల రుణ మాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ ది అని తెలిపారు మంత్రి కేటీఆర్.  కాళేశ్వరం ప్రాజెక్టు కాలంతో వేగంగా పూర్తవుతుందని..సాగుతో తెలంగాణను సస్యశ్యామలం చేస్తామన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే కాంగ్రెస్ ఓర్వలేక అనవసర రాద్ధాంతం చేస్తుందన్నారు మంత్రి కేటీఆర్. ఎన్నికల సయయంలో ఎవరు ఏమి పనులు చేశారో ప్రజలకు తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు ఓసి సమాధానం చెప్పాలన్నారు.

Posted in Uncategorized

Latest Updates