రైతులకు శుభవార్త : రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపుకి కేబినెట్ ఆమోదం

 కిసాన్‌ క్రాంతి మార్చ్‌ తరువాతయ రైతులకు ఊరటనిచ్చింది కేంద్రప్రభుత్వం. రబీ పంటలకు 2018-19 సీజన్ కి కనీస మద్దతు ధర(MSP) ను పెంచే ప్రతిపాదనను ఇవాళ(అక్టోబర్-3) మోడీ నేతృతంలో కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీంతో గోధుమల మద్దతు ధర క్వింటాకు 105 రూపాయలు పెరిగి, ప్రస్తుతం క్వింటా 1,840 రూపాయలుగా ఉంది. గోధుమతో పాటు మరో ఐదు రకాల పంటలకు కూడా కనీస మద్దతు ధర పెరిగింది.

ఈ ఏడాది సెప్టెంబర్‌ లో 20 శాతం లోటు వర్షపాతం, నీటి నిల్వలు పడిపోవడంతో, ఈ సీజన్‌ లో రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందేనని కేంద్రం నిర్ణయించి, ఈ ప్రకటన చేసినట్టు తెలిసింది. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడటంతో రైతులను ఆకర్షించేందుకు మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates